Thursday, August 6, 2015

జూ ఎందుకు !

అయ్యోరు ఊ అంటే జూ ఎందుకు !
కొల్లేరుకు నీరెందుకు కొంగలెందుకు!
మనుషులకసలు ప్రకృతి ఎందుకు!
గర్జించే సిమ్హం బోనులో ఉందిగా..
బయట ఉన్న మనకు వాటి గోడెందుకు?
జూ లో ఉండేవి మూగ జంతువులు...
జూ బయటనుండేది మూగ గొంతుకలు..
ఉన్న ఐ టి లకు నీరు లేదు దారి లేదు..
ఆకు పచ్చ కొండ తోలు తీసి
ఆఫీసులు కడతారా!
ఏ సి లో కూర్చొని
ఆదేశాలు ఇస్తారా!!
హుడ్ హుడ్ దెబ్బలు తీరకున్నాను
కోటి మొక్కల నాట్లు మాటలు
గాలి లోని మూటలయ్యే!
పరిహారం కూడ అండకుండానే...
పరిసమాప్తమయ్యె ప్రకృతి ప్రబంధం..!
ఈ లెక్కన మనుషులకే లెక్కలేదు..
ఇక జంతువులకు చోటెందుకు!!


No comments:

Post a Comment