Thursday, May 20, 2010

Nestamaa..........

నేస్తమా:::::



ఓ నేస్తమా... ఓ నేస్తమా...
దావానంలా చుట్టుముట్టే....
దాహార్తిని తీర్చెటి ఓ నేస్తమా ...
ఆహ్వానం ఉన్నా లేకున్నా
అభిమానం వుందని వెన్ను తట్టె ఓ నేస్తమా...
ఎద లోతులో బాధలుంటే..
చిరు నవ్వుతో ఓదార్చు వరమా ఓ నేస్తమా...
తేనెల మాటలతో వెన్న మనసుతో
వెన్నెల చందాన్ని చవి చూపించేవు ఓ నేస్తమా...
ఆట పాటలతో అలరిస్తూ..
మింటిని కంటికి మిన్నగా చూపించేవు ఓ నేస్తమా..
నా పయనం లో తోడువై...
నా నయనం లో వెలుగువై...
నా విజయం లో తళుకువై...
కోతి చేష్టలు ఎన్నైనా..
కోటి ఆశల రేపును నేడే నిర్మలమైన నీ నవ్వులో చూపించిన నేస్తమా...
నిత్యం నిలిచుండాలి మన బంధము...

Niraasha...

నిరాశ::

ఆశలు ఎన్నున్నా.. ... ఆకాంక్షలు తీరవు ..
అమ్ములు ఎన్నున్నా. ...గురినే చేరవు ...
చుట్టూ జనులున్నా ... జగమే నీదవదు...
చెట్టు నీడున్నా.... అది నీకే చెందదు ... ||2||


ఎడారి ఎంతున్నా ....మనుగడకు ఉండవు దారులే ...
గడియారం నీదయినా.. గడిచిన సమయం రాదులే ..
మబ్బులు కంట్లో ఎన్నున్నా ...చినుకు చెంపను చేరదు ...
గగనం నీ ముందున్నా ...ఇలనే తాకే జాడే ఉండదు .. (ఆశలు .. ||1||)



అయ్యో పాపం అని అనుకున్నా ...జరిగే పాతం ఆగదులె ...
అన్వేషించే ఆత్రుత ఉన్నా ... నీ జన్మే చాలదులే ..
పీల్చే శ్వాసే నీదయినా..... వీచే గాలే నీదవదు...
నడిచే పాదం నీదయినా....సాగే పయనం నీకే చెందదు ...

jayiddam........

జయిద్దాం ::

మానవాళి అంతయు కావాలి జాగృతం.....
విశ్వశాంతి కోరుతూ చెప్పేదే ఈ హితం.....

మతం వద్దు కులం వద్దు మాయ మర్మం వద్దు...
భాష వలదు ఘోష వలదు మహోన్మాధం వలదు ...

ధరణి మాత బిడ్డలం జగడాల కు కావాలి హద్దులం......
ఈ జగాన పుట్టినాం దానికి తెద్దాం ఒక ప్రయోజనం ....

శ్రమైక శక్తి మనది శ్రమ దోపిడీ వలదు మనకు....
కాయాకష్టం చేసినా కళ్లారా తీయాలి కునుకు.....

అదిగదిగో వచ్చెను హింసాత్మక పెనుభూతం .....
మంచితో అందరం దానికి పాడేద్దం మంగళం ....

అదిగదిగో వచ్చెను అసత్యాల పెను గోళం ...
సత్యమనే సాయుధం తో దానికి కదలికలకు వేద్దాం ఒక కళ్ళెం...

ఈర్ష్యాద్వేషాలు మనిషి పక్కలో బల్లాలు.....
మరి జాలి దయలేమో వాని బలాలు....
మనం ఆపేద్దాం లోకంలోని అల్లకల్లోలాలు....

శాంతి పధాన నడుద్దాం...
సమయస్ఫూర్తి తో వ్యవహరిద్దాం ...
ఈ జగాన జయిద్దాం...

AMMA:::::::

అమ్మ::

గోరుముద్దలు తినిపించే గారాబం అమ్మ....
గుండెల ఫై హత్తుకునే గాఢత్వం అమ్మ.....

మోకాలి ఫై పాకే పసికందువు నువ్వైతే ....
నీ కాలి ఫై నడిపించు విశ్వాసం అమ్మ......

పాల బుగ్గల ముద్దులొలికే చిన్నారివి నువ్వైతే ....
ఉగ్గుపాలు పట్టించు వెచ్చని ఒడి అమ్మ........

బువ్వ వద్దనే బుజ్జాయివి నువ్వైతే ...
అంబరం లో చందమామను అరుగింట్లో చూపించే అద్దం అమ్మ...

ఆటకు పరుగెత్తే అల్లరి పిడుగు నువ్వైతే ....
ఎంగిలి పడిన అంగిలి మూతిని తుడిచే చీరకొంగు అమ్మ...

ఊపిరి పోసిన.... ఊయల ఊపిన.....
అశ్రువు తుడిచిన .... ఆశలు నింపిన...
హద్దులు లేని ప్రేమను జగమున చూపిన ...
ఓ జనయిత్రీ .. నీకు శిరసు వంచెదన్...