Friday, October 18, 2013

నాకేం కావాలో!!!

నాకేం కావాలో నాకే తెలియట్లేదు.
జీవితాన్ని ఇలా గందరగోళంతోనే ,నాకంటూ ఇది కావాలి అని
నిక్కచ్చిగా తెలుసుకునే లోపలే తెల్లారిపోయేలా ఉంది.
ఇందులో కాలు,అందులో చేయి,ఉంకోదాంట్లో మూతి పెడితే, మొత్తానికి మునిగిపోతాం.
ఈ ముక్క చిన్నప్పుడే అమ్మ చెప్పింది.
కాని ఇప్పుడు మటుకు చెప్పటం లేదు.
స్వతాహాగ నిర్ణయాలు తీసుకునే వయసొచ్చిందని ఉద్దేశం కాబోలు!
అసలు నాకేంటి, అమ్మానాన్న లే ఓ రకంగా గందరగోళం సృస్టిస్తున్నారు అని నిందను నెట్టేస్తున్నాను.
ఆశలెక్కువా,పీకకు ఏది పడతాదో తెల్సుకోలేకపోడం;
వెరసి వార్తాపత్రిక లో ఏది ఇస్తే దాని పట్టుకు వేలాడటం,
మనకు పుర్తిగా దేని గురించీ తేలీకపోడం ,అమాయకత్వం.
పక్కవాళ్ళను చూసి ,వాళ్ళ మాటలకు విలువను ఇచ్చి;మనకేది
నచ్చుతుందో, దేనికి మనం పనికొస్తామో తెల్సుకోటం లేదు.
ఒక గమ్యం అనేదే స్పష్టంగా నిర్దేసించుకోలేనప్పుడూ,
దాని కోసం పాటుపడటం,తెగించటం ఎలా సాధ్యపడుతుంది?
ఏది ఏమైనా ఒకటి రెండేళ్ళు పోయినా పర్లేదు;నాకిదే సరైంది;నేను ఇందుకోసమె పుట్టాను,
దీనికే పనికొస్తాను అని దృఢ నిశ్చయం చేసుకోవాలి.
జీవితం కోసం జీవితం లోని ఓ రెండేళ్ళు పోయినా పర్లేదు.
జీవిత లక్ష్యం కోసం కొన్ని పణం గా పెట్టలేనప్పుడు,
మనకి మనమే తృణప్రాయం ఐనప్పుడు,
భయాందోళనలతో ఎటూ పోలేక, సతమతమవ్తున్నప్పుడు,
భుజం తట్టే వాడులేకపోయినా,
బెరుకూ-బెంగా లేకుండా,
ఇది నిశ్చయం,
ఇది నాదే!
ఏదేమైనా కూడా; అని గట్టిగా
నాలో నేను చెప్పుకునేదెప్పుడో?
ఏంటో!రకరకాలుగా పుర్రెలో పురుగు తొళిచేస్తుంది.
విధానం తేల్చుకోలేక నాలో నేనే నాతో నేనే,వందల విధాలుగా
పొట్లాడుతున్నాను. తర్కానికీ,మనసుకీ,వయసుకీ,
తగ్గదేదో తెలీక,తికమకలో కాలాన్ని ఖూనీ చేస్తున్నాను అనే
అపరాధభావనతో ,క్షణక్షణం నరకం అనుభవిస్తూ బతుకీడుస్తున్నాను!!