నేను నాదనుకోకు..
మేను మేలనుకోకు..
అందరిలో ఒకరిమే మనమను
నిజము ఎరిగి మసలుకో మిత్రమా!
కనుముసురు తొలిచి చుడుమా!!
నీవెవరో నేనెవరో తెలియకున్నా..
ఒక పయనం ఒక పడవేనని
తెల్సుకోమ్మా! నయనంలో
భీతి; మననంలో విరక్తి-కత్తి
ఏల సాటివాడిపై !! ||నేను||
నేనింతే అని అంటే నీ కొఱకు
లోకం మారునా! నలుగురితో
నడువంగా నారాయణుడే
నరుడు అవ్వగా; ఒక్కడినే
నంటే మనుగడ సాధ్యమా!! ||నేను||
మేను మేలనుకోకు..
అందరిలో ఒకరిమే మనమను
నిజము ఎరిగి మసలుకో మిత్రమా!
కనుముసురు తొలిచి చుడుమా!!
నీవెవరో నేనెవరో తెలియకున్నా..
ఒక పయనం ఒక పడవేనని
తెల్సుకోమ్మా! నయనంలో
భీతి; మననంలో విరక్తి-కత్తి
ఏల సాటివాడిపై !! ||నేను||
నేనింతే అని అంటే నీ కొఱకు
లోకం మారునా! నలుగురితో
నడువంగా నారాయణుడే
నరుడు అవ్వగా; ఒక్కడినే
నంటే మనుగడ సాధ్యమా!! ||నేను||
No comments:
Post a Comment