Monday, February 10, 2014

మాయా ప్రపంచం

మాయా ప్రపంచం,మాయా ప్రపంచం
మూఢంలో మునిగెను ప్రపంచం
అంధత్వంలో ఆహ్లాదతను వెతుకుతూ,
ఆపై అఙ్ఞానాన్ని విస్తరిస్తూ,
మూసిన మెదళ్ళతో మాదే నిజం అంటూ,
మిగిలిందంతా కల్ల అనే భ్రాంతి మాయలో
మైమరపించి, సంగీతంలో లీనపరచి ,
ఆహ్వానించి ఎదుటవారిని
ఇంతా బతికిన బ్రతుకు తప్పనీ,
మేమే సత్యం మేమే నిత్యం ,
మీరు మమ్మనుసరించమనీ,
వ్యాకోచించాల్సిన వయస్సు వారిలో,
సంకుచిత అనర్ధభావాల-
విత్తులను నాటుతూ,
విస్మరిస్తూ విశ్వరూపాన్ని,
విశ్వాసాలతో బతుకీడిస్తూ,
మంచి చెడులు, నడవడికలతో
నిమిత్తం లేక కరుణ ఉండునని-
వాగ్దానం ఇస్తూ,ప్రేమ పేరున-
ప్రార్ధనతో సమస్తం సమసిపోవునని,
కరుణతో కల్మషం కుళ్ళు కడుగబడునని,
తప్పుల చేసే అవకాశం ఉంది,
పాపం మాత్రాం సాతాను సొంతం-
కాదు కర్తదని ,నమ్మబలుకుతూ
ఉచ్చులోకి దింపుతున్నది ,
డబ్బులు వెదజల్లుతూ,
మనసులను  మనుషులను మార్చమని,
మాయ చెప్పగా,
చేతన చుపిస్తుంది వెర్రి ప్రపంచం!!!