Saturday, May 22, 2010

వేటూరికి నివాళి.........

తెలుగు పదముల తియ్యదనము గేయముల..పలికించిన ఘనునికి..
ఎంతో మంది భావి రచయితల స్పూర్థి దాతకు..
మౌనమనే అశ్రువులను మాకు మిగిల్చి వెళ్ళిపొయిన మా వేటూరి గారికి  కన్నీటి నివాళి

ఈ వేళ.....

ఈ వేళ:::::
ఆకాశాన హరివిల్లు....
నేలను నేడే తాకెనుగ...

ఆనందాల చిరుజల్లు....
ఈ వేళ నన్నే తడిపెనుగ..


అనురాగాల పరవళ్ళు....
ఇలన  నేడే తొణికిసలాడెనుగ..


చిరునవ్వుల చెక్కిల్లు...
నా చూపుకు నేడే చిక్కెనుగ..

Narakam......

నరకం:::::::

ఆలోచనలతో సతమతమవుతున్నా...
ఆవేశాన్నేమో అణగ త్రొక్కు తున్నా.....


ఆశలన్నీ గుండెల్లో చేరి... చేజారితే...
ఆత్మవంచనే.... నేనే అవుతున్నా...


నెలలోన నిట్టూర్పు.. వదిలింది నేడే కాదు...
నేల్లోన కలిసే వరకూ .. తప్పదేమో నాకీ తలపూ...


దహించే జ్వాలేదో నన్నేమో తరుముతూ ఉన్నా....
మనసేమో కదలను అంది...కాలి పోరా అంటూ వదిలేసింది...


రక్షించే ధైర్యం కుడా ...నా దరి చేరను అంది...
శిక్షేమో తప్పదు అంటూ ....గుండెల్ని తొలిచేసింది....


చెరలోనా బ్రతికే కాలం.... చరమం వరకూ అంది...
చలనం లేదే నాకు.... చర్మం ఊడే వరకూ....


పట్టంతా బిగిసింది .. ఉరినే వేసేసింది....
నరకానికి రమ్మంటూ.... ఆహ్వానం పలికేసింది.....