Sunday, February 10, 2013

దేశపు యువత


యువతే దేశపు స్తంభాలంటా..
ఎక్కడ ఏ చిత్రం ఆడుతుందో...
పసిగత్తడమే పరమావధి...
గణతంత్ర్యానికి...
స్వాతంత్ర్యానికి...
తేడా తెలీని విఙ్ఞులం మనం..
ఉద్యోగం బట్టి వచ్చే కట్నం..
ఇంతని ముందే లెక్కేసుకునే
ధనాఘనులం  అవినీతిని
నిందిస్తూనే ఎక్కడిక్కడ
సమర్పిస్తాము ఆశిస్తాము...
పాపం ఏమైనా ఉంటేగింటే...
ఉందిగ వెంకన్న సన్నిధిలో
హుండీ.. వాటా ఇస్తే సరి ..
పాతవి మాఫీ చేసి కొత్త అవకాశాలు
ప్రసాదిస్తాడుగా...
తనవరకు వస్తేగాని అధర్మం
ఙ్ఞప్తికి రాదు...ఆందోళన
లేనే లేదు... చెడు చేయటంలో
లేని భయం...పుస్సుక్కుమని పైకొస్తాది..
ఎదిరించమంటే మటుకు...
కలికాలం అంటే కల్గిన
వాని కాలం..కాబోలు..
కాసుల వేటలో ఉన్న చొరవ..
మనిషిగా బ్రతకడానికి
వెచ్చించము...ఏమంటే ..
సమయం అమూల్యమైందిగా..



కారణం లేని కన్నీరు


కారణాలు తెలీని కన్నీళ్ళు...
కంటిని తడిపితే...
మింగుడు పడని బాధ...
బెంగగా గొంతునుంటే...
ఏమైందో తెలీక,ఏం
చేస్తామో అసలే
అర్ధంకాక విసుగెత్తుంటే...
ఆవలి వాడు వచ్చి...ఇలా
ఉన్నావేంటి దిగాలుగా!! అని
జాబు లేని ప్రశ్నలు సంధిస్తే..
హత విధీ!!!
వర్ణనాతీతం..
నవ్వుని నటిస్తూ...
దాటవేయడం..





నిండే(దే) విప్లవం


రాసిందే రాతని..

చెప్పిందే 'గీత' అని...

ఎదుటోదిని నిందిస్తూ ..

ప్రశ్నల పరంపర

పాకంలో ముంచితే

గొప్ప కాబోలు...

అదేంటో నాకు బోధపడదు..

అదేనేమో విప్లవం అంటే...