Thursday, August 29, 2013

యువతకు అందని రూపాయి

పడిపోతున్న రూపాయి విలువ...
విలువలు లేని వ్యవస్థల చలువ...
అడుగిడుతున్న ఆశల ఝరిలో..
ఎదురీదుతున్న ఆశయం స్మృతిలో..
సమాజప్రవేశం పూర్తికాకున్నా యువతను...
భయబ్బలప్రయోగ్రప్పరీక్షలోన..
తోసి అదఃపాతాళలోతుకు నెట్టినారు..


తొంభైదశకం తొలినాళ్ళలోనే..
తల్లిఒడిలోనే చంపెయ్యకుండా...
చదువులు పేర శాసించినారు...
శైశవాన్ని సమాధిచేసినారు..
ఎదిగిన వేళ అందివ్వక్కుండా ..
అవకాశాలు హరించినారు...

తయారీ పరిశ్రమకు తిలోదకాలిచ్చి..
దిగుమతి కర్మకు దిగజార్చినారు...
అన్నింటా విదేశిమయంతో..
అడుక్కుతినే వెసులుబాటిచ్చినారు..

స్వాతంత్ర్యపు అర్ధం బాహ్యమేనా?
చిత్తంలో లేనప్పుడు..విత్తు చిత్తేగా!!
యాంత్రిక జీవనపు బాటకు..యూదు దేశాల..
ఇం-ధన అవసరం ...పసిడి పిచ్చోళ్ళ
ద్రవ్యోల్బణ బరువు...తీసింది రూపాయి పరువు..