మూసిన తలుపుల
లోపల ముగిసెను ఓ ప్రాణం!!
సూర్యుని రాకతో
మసిగా మారెను ఓ ప్రాణం!!
వెంబడే రాబందుల
వేటకు ఒరిగెను ఓ ప్రాణం!!
సారపు భూమి లో
కూరుకు పోయెను ఓ ప్రాణం!!
కురిసే వర్షములోనూ
కాలిపోయెను ఓ ప్రాణం!!
కపటపు నవ్వులలో
నలిగెను ఓ ప్రాణం!!
అణచిన దేవుడే
మరచిన ఓ ప్రాణం!!
తనువుకు చావును
తెచ్చేటి ఓ ప్రాణం!!
ఎవరూ..??
నేను ..ఎవరూ??..
ఎవరూ..??
నేను.. ఎవరూ??..
నువ్వు వెలుగు..
మరి నేను.. ఎవరు?
నువ్వు వర్షం
మరి నేను.. ఎవరు?
ఓ.. ఎవరూ..? ఎవరూ...?
రైలు వెతికి వచ్చి చచ్చిపడిన..
నేను ఎవరు?
పూల చెట్టుకు వేలబడుతున్న..
నేను ఎవరు?
నదిలో చచ్చిన మీనులా తేలుతున్న..
నేను ఎవరు?
కుమ్మరి గుడిసెలో కాలిపోతున్న..
నేను ఎవరు?
సామి రథాలు చేరువకాని..
నేను ఎవరు?
మీరు ముట్టని నీరు తాగే
నేను ఎవరు?
ఊరు గోడకు నెట్టబడిన..
నేను ఎవరు?
మీ మలాల గుంట లో శ్వాస విడిచిన..
నేను ఎవరు?
నాదే ఏలుబడి అని చెప్పారు..
నేను బానిసను అనీ అనుకున్నారు
రాష్ట్రం దాటితే 99% మంది కులాల పేర్లు కూడా ఎవడికీ తెలీదు...
దేశం దాటితే పాస్ పోర్ట్ మినహా మరో గుర్తింపు ఉండదాయే..
గొప్పదని డప్పేసుకునే నీ కుల వృత్తిని చేయటానికి నీకు చేతకాదు చేయి రాదు ..
ఇంక ఎంత చదివి ఏం లాభం ...
నోటి దుర్గంధం చేతి దురద ..
పక్క తడిపే
స్వీయనియంత్రణ లేని
పనికి రాని పిల్లి కూత లే
నీకు గాండ్రింపు లు
కొవ్వు పేరుకుపోయి
ప్రవహించు చిక్కని రక్తం
కలిగించే గుండె పోటు
కదా నీ కుల గళపు ఠీవి!!