డివైడ్ ఎన్ రూల్::::
విడగొట్టే విధానం... పడగొట్టే ప్రయత్నం...
చేస్తాము పోరాటం... చచ్చేంత ఆరాటం....
"డివైడ్ ఎన్ రూల్" కి బలి పశువులం....
మేము డివైడ్ అవుతాం...
మీకు రూలింగ్ ఇస్తాం...
బస్సులు తగలెట్టుతాం...
కిరో"సేన్"లు సృస్టిస్తాం...
కలక్షన్ లు మీకిస్తాం...
శవాలం మేమవుతాం..
శిలావిగ్రహాలు మీవంటాం..
మాకోసం పస్తుంటే.. మీకేమో బి.పి డౌన్...
మీడియా కి సెన్సేషన్.. మీకొస్తే ఓ ఫీవర్...
మేమేమో పస్తుంటే...విషజ్వరాలతొ చస్తుంటే...
పట్టదుగా ఎవ్వరికీ... దోమైనా కుట్టదు గా ఏ. సి లోని నాయకుడికి...