Thursday, October 29, 2015

మతం ముసుగులో

మతం ముసుగులో మంటలు!
కులం చాటున చింతలు!
నాదే గొప్ప నీది తుప్ప..
అని విర్రవీగేను గొంతులు   ||2||

దాడ్రి లోన దాడి లోన
మీది ముసుగు గోవుది!
రాత్రివేళ రాలిపోయిన
శై`శవాలు` రాజపుటనుది!!  ||మతం||

పంచనదుల నేల ఉడికెను
గురుగ్రంథ పేజీలు చిరుగగా!
శిరసు సిరముతో తడిసెను
భ్రాత రాతలు చిలుకగా!!   ||మతం||

ఉదంపూరు ఘటన లోన
దేహం విడిచెను సందేహమై!
కాలబుర్గి కనులుమూసెను
తన రచనే తూటా పేల్చగా!!||మతం||

దాష్టికాలు దావానాలు
దేశమును దహించగా!
దేశభక్తి సుత్తి సూక్తులు
దశను దిశను మార్చుతాయా?
మూలం వదిలి మూఢమైన
మూర్ఖులు మారుతారా?




No comments:

Post a Comment