Thursday, May 20, 2010

AMMA:::::::

అమ్మ::

గోరుముద్దలు తినిపించే గారాబం అమ్మ....
గుండెల ఫై హత్తుకునే గాఢత్వం అమ్మ.....

మోకాలి ఫై పాకే పసికందువు నువ్వైతే ....
నీ కాలి ఫై నడిపించు విశ్వాసం అమ్మ......

పాల బుగ్గల ముద్దులొలికే చిన్నారివి నువ్వైతే ....
ఉగ్గుపాలు పట్టించు వెచ్చని ఒడి అమ్మ........

బువ్వ వద్దనే బుజ్జాయివి నువ్వైతే ...
అంబరం లో చందమామను అరుగింట్లో చూపించే అద్దం అమ్మ...

ఆటకు పరుగెత్తే అల్లరి పిడుగు నువ్వైతే ....
ఎంగిలి పడిన అంగిలి మూతిని తుడిచే చీరకొంగు అమ్మ...

ఊపిరి పోసిన.... ఊయల ఊపిన.....
అశ్రువు తుడిచిన .... ఆశలు నింపిన...
హద్దులు లేని ప్రేమను జగమున చూపిన ...
ఓ జనయిత్రీ .. నీకు శిరసు వంచెదన్...

2 comments:

  1. enni padaalu jata parachina amma prema anirvachaneeyam
    but mee nirvachanam chalaaaaa bagundi...:)

    ReplyDelete
  2. చేయిపట్టి నడిపించే తొలి నేస్తం అమ్మ
    ఏదీ నాది కాని ఈ ప్రపంచంలో
    నాదీ అనుకునే ఓ ప్రియభావన అమ్మ

    చాలా బాగున్నాయి కవితలు. తెలుగు బ్లాగు ప్రపంచానికి స్వాగతం. :)

    ReplyDelete