Tuesday, May 29, 2018

భారతీయ సమాజంలో బంధాలు vs. బ్లాక్మెయిల్ :


తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులు , స్నేహితులు ఇలా అనుబంధాల మాటున తమ అభిప్రాయాలు, నమ్మకాలు, ఆలోచనలు, ఆకాంక్షలు ఒకరిపై మరొకరు రుద్దటానికి మన సమాజం లో సిద్ధంగా ఉంటారు. ప్రేమ, ఆప్యాయత, గౌరవం ముసుగులో లేదా బుజ్జగించో ,భయపెట్టో ,తిట్టి కొట్టో , లేదా చస్తామనో బ్లాక్మెయిల్ చేసో లేదా చంపుతామని బెదిరించో ఇలా ఏదో విధంగా తమ పంతం నెగ్గుకురావడం కోసం ఎంత కైనా తెగిస్తారు. అందుకే ఆత్మహత్యలు , పరువు హత్యలు, వరకట్న వేధింపులు , సాధింపులు ఇలా  రకరకాలు మనం తరచూ చూస్తుంటాము. భారతీయ సమాజము, సంప్రదాయం ,గౌరవం ,పద్ధతి  ఇలా వివిధ పేర్లతో  జబ్బలు చరుచుకొని గొప్పలు చెప్పుకుని చేసే దారుణాలు ఇవి. నిజానికి ఇవి "exploitation",  " atrocity", " harassment " కోవ లోకి చెందినవి అయినా మన కుటుంబస్తులు లేదా దగ్గరి వాళ్ళు చేసేవి కాబట్టి వీటికి పేర్లు ఆపాదించకూడదు అనుకుంటాం. అన్నదమ్ముల మధ్య సక్యత ఉండదు గానీ కులం , మతం అంటూ డింభాలు పలుకుతారు. తినటానికి కక్కుర్తి పడి ఏడుస్తూ ఉంటారు , సాధువో పంతులో పాస్టారో సాయిబో సెలవిస్తే వేలకు వేలు తగలేస్తారు. అలా ఎవడో బయతోడి మాటకు ఇచ్చే గౌరవం విలువ ఇంట్లో వాళ్లకు కూడా ఉండదు. ఇదో విచిత్ర రోగం మన సమాజంలో. పరువు, మర్యాద, కులము, సమాజము పక్కింటోల్లో, ఎదురింటి వాళ్ళ మాటలు వీళ్లకు ముఖ్యం. మిగతాదంతా సీరియల్ లో మెలో డ్రామా మాత్రమే. పెద్దరికం ముసుగులో తమ పంతం నెగ్గుకు రావచ్చు, కాదు కూడదు అన్నారా... నీకు కుటుంబ విలువలు లేవు, అనుబంధాల విలువ తెలియదు, స్వార్ధపరుడవు, తల్లిదండ్రులు అక్క చెల్లెలు అన్నదమ్ములు అత్తమామలు అన్న గౌరవం మర్యాదలు లేని మృగానివి , అనాగరికుడివి , కర్కసుడివి  ఇలా నీలాపనిందలు తప్పవు. అతి కొద్ది కుటుంబాలు మినహా అత్యధిక శాతం కోవకు చెందిన కుటుంబాలే. కాకపోతే బయటకు చెప్పుకోము, చెప్పుకోకూడదు గా. ఎంతైనా మనకు prestige ప్రాబ్లెమ్ ఎక్కువ అసలు విషయం కన్నా! మనకు జీవితం కన్నా ఉహాజనీతమైన వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాము. ఎలాగైనా మటుకు మన ఇగోల తృష్ణ ,కండూతి తీరిపోవాల్సిందే.
నోట్1:చాలా మంది దృష్టిలో ఇది మన సమాజం పై , కుటుంబ వ్యవస్థలపై విదేశీయులు డబ్బులు వెదజల్లి  చేయిస్తున్న దాడి .సినిమాల వల్ల చెడిపోయిన యువతరం చేస్తున్న పిచ్చి ప్రేలాపన. ఇలానే అనుకుని స్వయంతృప్తి పొందండి. ఎక్కువ ఆలోచించకండి.
నోట్2: నీ ఇంట్లో ప్రాబ్లెమ్ ని ఇలా రాసావా అని అడిగే వాళ్ళు , ఆలోచించే వాళ్ళు ఎక్కువ. నేను రాసింది నేను చూసిన సమాజం గురించి. అది ఒక ఇంటికి పరిమితం అయితే ఇంత రాయాల్సిన అవసరం లేదేమో!
నోట్3: ఇది నీ అపరిపక్వత,ఆవేశం, నెగటివ్ థింకింగ్ అంటారు. అవును పైన చెప్పిన "నీలాపనిందలు" అకౌంట్ లో పదాలు జమా చేయటం మరిచిపోయా. ఎవరి అభిప్రాయం వాళ్లది. మీ అభిప్రాయం తో నేను ఏకీభవించచ్చు , వ్యతిరేకించచ్చు కానీ నా ఉద్దేశాలు మీ పై రుద్దను.
నోట్4: ఇంక నోట్ లు చాలు.ఇలా అందరికి సంజాయిషీ ఇస్తూపోలేను. మీకు నచ్చినట్టు మీరు అనేసుకోండి. మీరు ఏదో అనుకున్నారని , అనుకుంటారని నేను పెద్దగా ఫీల్ కాను.

No comments:

Post a Comment