Saturday, February 6, 2016

ప్రయాణంలో ప్రమాణం ::

ఎందుకేది అవుతుందో
అవగతం అవకున్నా..
నా స్వగతం గతంలా మిగిలిపోరాదు..

రేపన్న ఆకాంక్ష
తరుముతూ ఉన్నా..
నేటి నా సంకల్పం కల్పనలా కరిగిపోరాదు..

నేటి ఈ బతుకులో కుదుపులు వలన
అదుపు తప్పినా మలుపులు తిప్పినా..
వగపు తలపు తలుపుతట్టరాదు

గమ్యం ఏంటో తెలియదు నాకు!
ప్రయాణపు ప్రయాసల బడలిక అంచనాలేదు!
తెల్సినదల్లా తిన్నగాపోవటం;
శ్వాస జారేలోపు పట్టు సడలక
అడుగు వేసుకుపోవటం!
ఎంచేతంటే..
గమ్యం కన్నా ముఖ్యం
బహుశా ప్రయాణంలో ప్రమాణమేనేమో!

1 comment: