సిగ్గు సిగ్గు !!
మిమ్ము ఎన్నుకున్న ప్రజల
పాలిట భారం మీరు!!
భారత సర్వోన్నత పార్లమెంట్ లో
కారాలు మిరియాలు చల్లి,
చేతి గాజులు విసిరి,
మైకులు విరగ్గొట్టి,
ఏం సాధిస్తున్నారు?
ప్రపంచం కళ్ళలో
వెధవల్ని చేస్తూ భారతాన్ని;
పరువులు పీకి పందుల వలె
నిస్సిగ్గుగా తిరుగుతున్నారు.
ప్రజల అభిలాషలను
నెరవేర్చుటకు ఉన్న మీరు
ఆ ప్రజల ఆత్మగౌరవాన్ని
సమాధి కడతున్నారు.
పిచ్హాసుపత్రి లోనో పందులదొడ్డ్లోనో
ఉండాల్సిన నికృష్టులను ఎన్నుకున్న
ప్రజలను చూసి జాలేస్తుంది.
భారతీయునిగా గర్వభంగంతో
తలదించుకుంటున్నా; ఈ పిచ్చోల్ని
పరోక్షంగా పార్లమెంటుకు
పంపినందుకు సిగ్గుపడుతున్నా!!
మిమ్ము ఎన్నుకున్న ప్రజల
పాలిట భారం మీరు!!
భారత సర్వోన్నత పార్లమెంట్ లో
కారాలు మిరియాలు చల్లి,
చేతి గాజులు విసిరి,
మైకులు విరగ్గొట్టి,
ఏం సాధిస్తున్నారు?
ప్రపంచం కళ్ళలో
వెధవల్ని చేస్తూ భారతాన్ని;
పరువులు పీకి పందుల వలె
నిస్సిగ్గుగా తిరుగుతున్నారు.
ప్రజల అభిలాషలను
నెరవేర్చుటకు ఉన్న మీరు
ఆ ప్రజల ఆత్మగౌరవాన్ని
సమాధి కడతున్నారు.
పిచ్హాసుపత్రి లోనో పందులదొడ్డ్లోనో
ఉండాల్సిన నికృష్టులను ఎన్నుకున్న
ప్రజలను చూసి జాలేస్తుంది.
భారతీయునిగా గర్వభంగంతో
తలదించుకుంటున్నా; ఈ పిచ్చోల్ని
పరోక్షంగా పార్లమెంటుకు
పంపినందుకు సిగ్గుపడుతున్నా!!
సాటి మనిషిని కాళ్ళతో చేతుల్తో యెదాపెడా తన్నిన వాడు శాసన సభకెలా వచ్చాడో మరి?అది తప్పు కానపూడు ఇదీ తప్పు కాదని తెలుసుకో?
ReplyDeleteయతో ధర్మ స్తతో జయం!
ReplyDeleteఆర్టికిల్ 3 చరిత్ర ఇది: భారత దేసం స్వరాజ్యం సంపాదించుకున్న వేల అప్పటికే నిజాము లాంటి వాళ్ళు కాక 1930ల్లోనే శాసన సభలు యేర్పరచుకుని ఉన్న వాళ్ళూ ఉన్నరు. వాళ్ళల్లో కొందరు ఈ దేశంలో కలవదానికి ఇష్ట పడని వాళ్ళు వాళ్ళ సభల్లో తీర్మానాలు చెయ్యరు గనక అప్పటి అవసరం కోసమే ప్రత్యేకంగా రూపొందించారు.ఆ అవస్రం తీరిపోయాక దాన్ని రద్దు చేద్దామనే ప్రస్తావన కూడా వొచ్చింది. ఆ యెడ్వినా ప్రియుడు ప్రత్యేకంగా రద్దు చెయ్యటం దేనికి, దానంతదే రద్దయిపోతుంది లెమ్మని చప్పరించేశాడు.అది ఇవ్వాళ కోతికి కొబ్బరికాయ దొరికినట్టు తెవాదులకి దొరికింది.
శ్రీ రాముడు మూలస్థంభంగా ఉన్న సంస్కృతి గల ఈ జాతిని పద్దెనిమిదేళ్ళు అవిచ్చిన్నంగా యేలి వేలు పెట్టిన ప్రతి చోటా కుంపట్లు రగిలించి ఆఖరి రోజుల్లో తన తప్పులు కళ్ళ ముందు వెక్కిరిస్తూ కనబడుతుంటే అప్పుడు సిగ్గు పడిన ఆ స్త్రీ లోలుడు చెయ్యకుండా వొదిలేసినదీ ఒక కుంపటికి కారణమయింది.
అందర్నీ సమానంగా చూడాల్సిన ప్రజల్లో కొంత మందిని కులాల వారీగా మతాల వారీగా మైనార్టీలుగా ప్రకటించటం సాంకేతికంగా సమర్ధనీయం కాకపోయినా కొంత సహించవచ్చు అందులో మానవతా దృక్పధం ఉంది కాబట్టి.కానీ భారత పార్లమేంటరీ సాంప్రదాయం ప్రకారం రాజ్యాంగ బధ్ధంగా అన్ని హక్కులతో అధికారాలతో ప్రజా ప్రతినిధులుగా యెన్నికయిన వాళ్ళు తమని ఒక ప్రాంతం పేరుతో మైనార్టీలుగా ప్రకటించుకోవటం మాత్రం యే విధంగా సమర్ధనీయం? వారి నెన్నుకున్న ప్రజల్ని దద్దమ్మలుగా లెక్కించి అవమానించటం కాదా?
మొత్తం రాష్ట్రానికి సంబంధించి గానీ తమ ప్రాంతానికి గానీ ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో – ఒక బిల్లుని సభలో ప్రవేశ పెట్టటానికి గానీ, వేరే సభ్యుడు ప్రవేశ పెట్తిన బిలులో సవరణలు సూచించటానికీ వోటింగు జరిగితే దాన్ని వ్యతిరేకించటానికీ సమర్ధించటానికీ ప్రతి శాసన సభ్యుదికీ అధికారం ఉన్న పరిస్థితుల్లో, భారత రాజ్యాంగమే పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాల్లో మెజార్టీ నిర్ణయమే శిరోధార్యం అని చెప్తున్న్నప్పుడు ఇక్కడ మేం మైనార్టీలం కాబట్టి మా మాట చెల్లదనటం రాజ్యాంగ విరుధ్ధమయిన వాదన కాదా?
యెందుకు రాష్ట్రాన్ని విభజించుతున్నారనే దానికి సరయిన కారణాన్ని చెప్పలేకనే గదా స్టేట్మెంట్ ఆఫ్ ఆప్షన్స్ లో ఖాళీగా ఉంచింది. ఒక రాష్ట్ర విభజన అనే రాజ్యాంగ బధ్ధమయిన ప్రక్రియ యెందుకు విభజించుతున్నారో బిల్ల్లులో ప్రస్తావించలేనంత రాజ్యాంగ విరుధ్ధమయిన పధ్ధతిలో యెందుకు జరుగుతున్నది?రాష్ట్ర విభజనలో తప్పని సరిగా ఉండి తీరాల్సిన ఆర్ధిక పరమయిన విభజన యేదీ లేనప్పుడు సానకేతికంగా అది సంగ్రమయిన బిల్లు యెలా అవుతుంది?అసమగ్రమయిన బిల్లుని సభ ముందు పెట్టటంలోని ఉద్దేశం యేమిటి?
బిల్లుని సభలో ప్రవేసపెట్టటానికి సభ్యులకి సమాచారం కూడా అందించకుండా సభలోఅనె ఉన్న ప్రతిపక్ష నాయకురాలికే తెలియనప్పుడు ప్రవేశ పెట్టేశాం అనటంలో ఉన్న రాజ్యాంగ బధ్ధత యేమిటి?యేది రాజ్యాంగ బధ్ధంగా జరుగుతున్నదని మీరు యెదటి వాళ్ళని రాజ్యాంగాన్ని అవమానిస్తున్నట్టు విమర్శిస్తున్నారు?
రాజ్యాంగం (ఆర్టికల్ 3 తో సహా) జనవరి 26, 1950 నాడు అమలులోకి వచ్చింది. అప్పటికే సామ్రాజ్యాలన్నీవిలీనం అయ్యాయి. ఈ అధికరణ కిందే 1953లొ ఆంద్ర రాష్ట్రం ఏర్పడింది.
ReplyDeletePS: ఆంద్ర రాష్ట్ర అవతరణ బిల్లులో కూడా statement of objects & reasons లేదు.
+Hari Babu Suraneni వారు చేసారు మేము చేస్తాం అనటం దౌర్భాగ్యం.
ReplyDeleteతప్పు ఎవరు చేసినా తప్పే!!
కానీ నా దేశపు చిహ్నం ఐన పార్లమెంటులో చేసిన
అనాగరికమైన హేయమైన పనులను నేను సమర్ధించలేను.
ప్రపంచం దృష్టిలో పరిపక్వత లేని ప్రజాస్వామ్యం గా
చిత్రీకరించినందుకు గాను ఈ ప్రజాప్రతినిధులను దుయ్యబట్టాల్సిందే ఖచ్చితంగా!!
రాగద్వేషాలకు అతీతంగా ఉంటానని రాజ్యంగపరంగా ప్రమాణంచేసి
రాజ్యాన్నీ రాజ్యాంగస్పూర్తి ని వెక్కిరించినందుకు వీళ్ళను దండించాల్సిందే!!
అటు తెలుగువాళ్ళ పరువు .. ఇతు దేశపు మర్యాద రెండు పీకి పెంట చేసారు.
ఇటువంటి హేయమైన చర్యను సమర్ధించటం మన అవివేకానికి , మన అంధ విశ్వాసానికి తార్కాణం.