Sunday, February 10, 2013

కారణం లేని కన్నీరు


కారణాలు తెలీని కన్నీళ్ళు...
కంటిని తడిపితే...
మింగుడు పడని బాధ...
బెంగగా గొంతునుంటే...
ఏమైందో తెలీక,ఏం
చేస్తామో అసలే
అర్ధంకాక విసుగెత్తుంటే...
ఆవలి వాడు వచ్చి...ఇలా
ఉన్నావేంటి దిగాలుగా!! అని
జాబు లేని ప్రశ్నలు సంధిస్తే..
హత విధీ!!!
వర్ణనాతీతం..
నవ్వుని నటిస్తూ...
దాటవేయడం..





1 comment:

  1. అలా నవ్వులో దాచి జీవించడమే నటన:-) బాగుంది!

    ReplyDelete