Friday, September 17, 2010

'సౌమ్య'o

అపరంజి చూపు చిగురించిన సౌమ్యం..
అమృత సలిలంబు సేవించిన సౌమ్యం..
అచ్చెరువొందు     అందము సౌమ్యం..
అక్కరకొచ్చు       బంధము సౌమ్యం...
లేలేత      మనసున  కోరిక సౌమ్యం..
తేనెల    మాటల  మురిపం సౌమ్యం...
తేటగీటిన    తెనుగు పద్యం సౌమ్యం.
స్నేహగీతమునకు సాక్షం నీవు సౌమ్యం....

సౌమ్య కు జన్మదిన శుభాకాంక్షలు..

ఇరుపది వయస్సున అడుగిడినా...
బుడిబుడి నడకల పసిపాపాయివే...
చిరు మందహాసం ముఖమున విరియగా..
అలజడి వరుసలు సమసిపోవునే...
అల్లరి చేష్టల పిల్లనగ్రోవి లా..
ఆనందం పంచి ఇచ్చేటి స్నేహమా..
ఆయువు నిండుగా వెలుగగా..
హాయిగ వికసించు పారిజాతమా..

Thursday, September 16, 2010

నేడు

నేడు కనుమూస్తున్నాను..
రేపు తెరుస్తాను అన్న నమ్మకంతో...
నేడు ముగిస్తున్నాను..
రేపు పూర్తిచేయగలను అన్న విశ్వాసంతో...
నేటికీ రేపుకీ...గంటల వ్యవధి..
అయినా రేపు ఏమిటో నిక్కచ్చిగా  తెలియనిది...
అందుకే చేతిలోని నేడు ఎంతో విలువైనది...

Saturday, September 11, 2010

చినుకు

ఆకాశం  భూమి నడుమ దూరాలు ఎన్ని?
ఏనాడో వీడిన స్నేహాలు అన్ని...
తొలకరి చినుకు చిగురించును మైత్రిని...
ఇరువురను కలపగ తంటాలు ఎన్ని!
మధ్యవర్తికి బహుకష్టం సుమీ!
పైనుండి పలకరింపు తేవంగ ..
                 .......నేల పులకరించును!
కిందటి కవ్వింపులను  చేర్చగా....
                ....... మేఘమై మైమరపించును!
ఇరువురను కలపగ తంటాలు ఎన్ని!
ఋతువులు  మారంగ రుపం మారును....
మైత్రికి  నాంది చినుకే పలుకును....