Friday, November 30, 2012

నేనేం పీకాలో...



అరెరే... ఏదో పీకేదామ్మని పుట్టేసా..
అదే ఆత్రుత తో నేలపై పాకేసా....
నెమ్మదిగా ఐనా నడక నేర్చుకున్నా...
పడిపోతూ కూడా...పరుగెట్టుకొచ్చా...

బడి లో వేస్తే బుద్ధిగా చదివేసా...
కలం తప్పితే కాలం తో  గళం ఎదగలేదు...
పుత్తం తప్పితే చుట్టం పేరు కుడా తెలీలేదు..
ప్రపంచం నీ ముంగిట అంటే అంతర్జాలం ..
సాలిగూడులో చిక్కుకుపోయా....
నిజంకల్లల తేడాలను గుర్తించలేని...
వర్ణాంధుడిని చేసేసింది ....
ఆత్రుత ఉంది గాని అతుక్కుపోయా....
పని ఉన్నా పనికిమాలినది పట్టివదలదే...

ఇదంతా చూస్తుంటే......నేనేం పీకాలో...
అర్దమయింది.... ముందుగా ఈ మాయజాల
టక్కుటమార అంతార్జాల అనుసంధాన్ని  పీకాలని..



Monday, November 12, 2012

వలపు


నాలుగేళ్ళ నిజ జీవితంలో... నలుగురు మధ్య తిరిగిన వేళలు....
నడి రేయి నాలుగింటి దాకా దూరవాణి లో ఊసులు... వలలు...కలలు...
నాలుగొందల మైళ్ళు తిరిగిన ఊర్లు... సముద్రపు అలలు...
ఇవ్వన్నీ... ఇవ్వన్నీ... ఆ సంద్రపు ఒడ్డున ఇసుకపై రాసిన... కథలు..
ఎప్పటి లానే... కరిగిపోయెను.. చెరిగిపోయెను... అలకలల తాకిడికి....:(

కళాశాలలో కొలువుల తలుపులు తెరిచెను...
కొత్త ఆశల మొలకలు చిగురించెను...
ఇరువురికి దక్కెను ప్రాంగణం...
కానీ నే చేరలేదు...నచ్చక పనితనం...
ఊసులు.. తరిగెను... మాటలు తగ్గెను...
నెలలు తిరగ్గా.... తాను మారెను...
నన్నెరుగక... తనకు ఏమవ్వన్ని..
తలపునై మిగిలా వలపులో ఓడి...:(