Friday, March 11, 2011

ఆకు...


పచ్చని ఆకు పొడిబారే
యవ్వన సోయగానికి ఎండ తాకే'...
శిశిరం ఇది సారం విడి పోమాకే'..
నేలను రాలినా ఎరువుగా తరువును వదులకే'..

పోయిన ప్రాణమా పునర్చిగురించుమా..
ఆమని ఋతువు ఆహ్వానం నీకురా ఓ ఆకు..
బోసి చెట్టుకు పాలపంటి పాపాయి చిగురుటాకు..
నెమ్మది వదులు  వదిగాలి వీచె సాకు తో..

పచ్చని మేని నిగలు హాయిలే మా కంటి పాపకు..
జవ్వన  గొంగళిని కోక ఆరేసిన చిలుకను చేసినావె ఓ ఆకు..
ముచ్చట గొలుపు మామిడి పిండెకు పూవుకు మొదలు నీవని తెలుసు మాకు..
మాపువేళ కట్టిన గువ్వల గూడుకు ఆధారం నీవని మరువకు..


పగిలెను రాళ్ళు చాలా ఎండకు...
నీడను ఇవ్వరా ఒంటరి బాటకు..
పందిరికి పూరిగుడిసెకు తాటాకు...
నీవేలేనిదే చిధ్రం నిరుపేద బ్రతుకు...

బువ్వను వద్దించిన విస్తరాకు...
పెళ్ళి ఇంటికి  ప్రతీక అరిటాకు..
నాళిక రంగు నాభికి ఊరట తమలపాకు..
పేరులు వేరైన మాపై అదే ప్రేమ కురిపించినావె ఓ ఆకు..