Thursday, December 15, 2011

విత్తనం


సాధ్యాసాధ్యాల నడుమ నలిగిన విత్తును నేను...
పెరిగే వృక్షాన్నో...సమాధిలో శవాన్నో నేను...
నీతితో కూడిన నీటిని మనసుతో వెలసిన మట్టిని...
జాగృతి కలిగించు వెలుతురును అర్థిస్తున్నాను...
నాకు ఊపిరి పోయమని... మందిని సేవించే భాగ్యం ఇమ్మని..

Sunday, September 11, 2011

చెన్నపట్నవాసం


చెన్నపట్నం చేరుకున్నా..
క్రొత్త బ్రతుకు వెతుకులాటలో..
చోటు మారినా రాత మారునా!!..
చింత చితికెలో తీరునా!!...

పట్నమంటే నాదె పొమ్మని..
విర్రవీగిన బావికప్పను..
చెన్నపట్నపు చిన్న వీధులు..
తిప్పి తిప్పి తిక్క రేపెను...


ఊరుచూస్తే తారు అడవి..
పేరుమారును సందుగొందుకు...
జనసంద్రములోన చుక్కను..
నాకు ఇల్లే దక్కలేదే..


కొంపలీడ అగ్గిపెట్టెలు...
బస్సులీడ బరువు మనతో..
రాతిరేళా అన్నం ఎరుగరు..
నిద్ర ఎరుగరు మర మనుజులు..

Wednesday, August 17, 2011

అవినీతికి వ్యతిరేకంగా..

ప్రజాస్వామ్య దేశం లో..
ప్రజల నోరును కట్టి...
అవినీతిని ఎండకట్టే...
ఉద్యమాన్ని అణగత్రొక్కే..
కాళ సర్పాల పన్నాగం..
మిన్నకుంటే.. అందదు
మిణుకుమనే ఆకాశం..
నిన్న కంటి ముసుగు
విడిచి నేడు చూడు ఆశయం..
సిద్ధి బుద్ధి త్రికరణ శుద్ధిగా
చూపించు ఆవేశం..
నీవు కోరే సమాజానికై
పోరే వారికి అందించు ప్రోత్సాహం...
భావప్రకటనను హరించి
స్వాతంత్ర్యపు అర్ధాన్ని...
బందీఖానా చేసిన
వారు విదేశీయులు కాకున్నా..
విద్రోహులే దేశానికి...
ఆనాటి యోధుల నామస్మరణలతో..
అడుగిడు ఎదురోడు.. స్వదేశపు
చీడ పీడ అవినీతికి వ్యతిరేకంగా..

Friday, July 29, 2011

తీరం-తర్కము

కదలే లేని కడలి లోతులో...
ముత్యం ఉందో మృత్యువు ముందో...
తీరం దాటక తీరుతెన్నులు...
తడిమి చూడటం తర్కము కాదే..!!

Friday, March 11, 2011

ఆకు...


పచ్చని ఆకు పొడిబారే
యవ్వన సోయగానికి ఎండ తాకే'...
శిశిరం ఇది సారం విడి పోమాకే'..
నేలను రాలినా ఎరువుగా తరువును వదులకే'..

పోయిన ప్రాణమా పునర్చిగురించుమా..
ఆమని ఋతువు ఆహ్వానం నీకురా ఓ ఆకు..
బోసి చెట్టుకు పాలపంటి పాపాయి చిగురుటాకు..
నెమ్మది వదులు  వదిగాలి వీచె సాకు తో..

పచ్చని మేని నిగలు హాయిలే మా కంటి పాపకు..
జవ్వన  గొంగళిని కోక ఆరేసిన చిలుకను చేసినావె ఓ ఆకు..
ముచ్చట గొలుపు మామిడి పిండెకు పూవుకు మొదలు నీవని తెలుసు మాకు..
మాపువేళ కట్టిన గువ్వల గూడుకు ఆధారం నీవని మరువకు..


పగిలెను రాళ్ళు చాలా ఎండకు...
నీడను ఇవ్వరా ఒంటరి బాటకు..
పందిరికి పూరిగుడిసెకు తాటాకు...
నీవేలేనిదే చిధ్రం నిరుపేద బ్రతుకు...

బువ్వను వద్దించిన విస్తరాకు...
పెళ్ళి ఇంటికి  ప్రతీక అరిటాకు..
నాళిక రంగు నాభికి ఊరట తమలపాకు..
పేరులు వేరైన మాపై అదే ప్రేమ కురిపించినావె ఓ ఆకు..

Monday, February 7, 2011

ఈ స్నేహం

కదిలిన గురుతుల సమాహారం ఈ స్నేహం
మెదిలిన మనసుల మణిహారం ఈ స్నేహం
గడిపిన క్షణములే... గుండెల్లో దాగెలే
విరిసిన నవ్వులే.... మదిలో మారుమ్రోగెలే     ||2||


బాల్యపు బలపమే తెలిపెను ఈ స్నేహం
బుడిబుడి నడకలో బడిలో కలిసెను ఈ స్నేహం
వడివడి చదువులో చనువు పెంచెను ఈ స్నేహం
గడబిడ గంతులో గొంతు కలిపెను ఈ స్నేహం

||కదిలిన||

ఎదిగిన వయస్సులో  వినోదం ఈ స్నేహం
వదిలిన కన్నీటిని  తుడిచిన హస్తం ఈ స్నేహం
సడలని పట్టులో వికాసం ఈ స్నేహం
చెదరని నీతికి చేరువ చిహ్నం ఈ స్నేహం

||కదిలిన||

Sunday, February 6, 2011

రాజకీయం..

రాజకీయం.. రంగులమయం...
వేషాల జగన్నాటకం..
చక్కిలి చిరు బూటకం..
కాసుల వేట లో
గడిపె పూటలు..
దాచిన సొత్తుకు..
బినామీ హామి గుట్టులు...
మింగేవాడికి తప్ప పెట్టేవాడికి కలిసిరాని జూదం...
రండి రండి ఇది ప్రజల పక్షాన చూద్దాం...