Monday, May 18, 2015

విలువేలేని మమత


ఎన్నో ఉన్నా అన్నీ నువ్వే అనుకున్నా..
ఎంతో కాలం నీవై నేను బ్రతికున్నా..

నీ కనులకు మనసుకు చేరువలేనా!
నీ కాంక్షకు మీమాంసకు చేరలేదా!!
http://raatalu.blogspot.in

చెరలోనా ఉంచేసి చర్రున ఎగిరావా!
ఆశల్లో ముంచేసి అమాంతం విడిచావా!
గతమంతా చిదిమేసి కనుమరుగయ్యావా !
రేపన్నది లేకుండా  యెదలో గాయం రేపావా!
నాపుట్టుక విలువంత మట్టిలో కలిపిన మమతవా!!




ఏముంది?



ఏముంది నీకు నాకు నడుమ?
తరిగిన మాటలు కరిగిన కలలు
చెదిరిన ఆశలు కదలని కలతలు
కూలిన కోటలు తగిలిన కోతలు
నిట్టూర్పు శ్వాసలు నిస్తేజపు నడకలు
నిన్ననే నిశిలో కలిసిన మనసులు
ఇంతకు మించి ప్రళయపు ఏకాంతం
మిగిల్చి మాయమయ్యావే నువ్వెక్కడ?

Saturday, May 9, 2015

వెలకట్టలేని యువరాణి::



చిరుజల్లుల నగవుకు సరితూగు సిరులు ఎక్కడ?
మృదుకోమలి మోముకు సరిపోవు మల్లెలు ఎక్కడ?
సుకుమారి సోకుకు సరిసాటి సొగసు ఎక్కడ?
వయ్యారి సొంపుకు సరిపాటి మయూరి ఎక్కడ?
యువరాణి విలువకు వెలకట్టే కుబేరుడు ఎక్కడ?

Saturday, February 21, 2015

మాతృభాష

మాతృభాష రా ఇది! మృతభాష కాదిది!!
వెయ్యేండ్ల వైభవం ఇది! వెన్నభాష రా ఇది!!
"దేశభాషలందు తెలుగు లెస్స" అంటే
సరళం,సులభం అని రాయలోరి మాటది!
ఆంగ్ల పంకిల పంక్తులలోని ' లెస్స్ ' కాదిది!!

ఉచ్ఛరణలోని మధురం!
అలంకారాల అంకురం!
ఛలోక్తి ఛందోప్రయోగ కర్మాగారం!
యతిప్రాస పదమైత్రిల అనురాగం!
యాసప్రయాసల వైరుధ్య భేదగానం!

ఆంగ్ల అయ్యోరు బ్రౌన్ ఆస్వాదించిన  తాళపత్ర గ్రంధాలు!
తాళ్ళపాక అన్నమయ్య ఆలపించిన తేటతెనుగు గేయాలు!

దేశమంటే మట్టికాదు మనుజులని
నరుల కీర్తిని గుణించిన గురజాడ పాఠాలు!
పదండి ముందుకు పదండి త్రోసుకని
నరనరాల ఉత్తేజం నింపిన శ్రీశ్రీ రచనాస్త్రాలు!

ఇవి గదా మన సంస్కృతి!
మనః నమోస్తుతి త్రిలింగ భాషకు!
అట్టి తీయనైన నా తల్లి తెలుగు దేవేరికి ప్రణామాలు!!

Monday, March 10, 2014

గందరగోళం


ఎన్నికల వేళ,ఎన్ని కలలో;
ఓటరు జాతర మొదలు-మూడునెలల మునుపె;
బహిరంగ సభలు-బలప్రదర్శనలు;
వాగ్దానాలు-వాగ్వాదాలు;
సర్వేలు-సంప్రదింపులు;
గోడ మీద పిల్లులు- గుంటనక్కలు;
పార్టీ స్థాపనలు-ఫిరాయింపులు;
అభివృద్ది జపం చేస్తూ-అవకతవకలు;
అవినీతిపై పోరాటం అంటూ-దందాలు కబ్జా ఘనులకు టికెట్లు;
నిజాయితీగా నిలబడ్డ వారికేమో.. నిరుత్సాహపు ఇక్కట్లు;
క్రిమినల్ కేసులు విద్యార్హతలు చూడంది సామీ,
కులమతప్రాంతీయతల కండూతిని వదలందెహే ;
అంటుంటే వస్తున్న వ్యతిరేకతలో సగంలోసగం;
మీకోసం నిలబడుతున్న వారికి అందించరు ఆలంబన ;
బదులు నెగ్గరంటూ ఊరికి ముందే చేస్తారు అవహేళన;
జయాపజయాలు తప్ప ధర్మాధర్మాలు ,
తప్పొప్పుల తలంపులు తెలుసుకోని జనాలు;
ఇదందీ సంగతి - ఎన్నికల వేళ ;
గగ్గోలల గందరగోళం  !!





Thursday, February 13, 2014

సిగ్గు సిగ్గు !!

సిగ్గు సిగ్గు !!
మిమ్ము ఎన్నుకున్న ప్రజల
పాలిట భారం మీరు!!
భారత సర్వోన్నత పార్లమెంట్ లో
కారాలు మిరియాలు చల్లి,
చేతి గాజులు విసిరి,
మైకులు విరగ్గొట్టి,
ఏం సాధిస్తున్నారు?
ప్రపంచం కళ్ళలో
వెధవల్ని చేస్తూ భారతాన్ని;
పరువులు పీకి పందుల వలె
నిస్సిగ్గుగా  తిరుగుతున్నారు.
ప్రజల అభిలాషలను
నెరవేర్చుటకు ఉన్న మీరు
ఆ ప్రజల ఆత్మగౌరవాన్ని
సమాధి కడతున్నారు.
పిచ్హాసుపత్రి లోనో పందులదొడ్డ్లోనో
ఉండాల్సిన నికృష్టులను ఎన్నుకున్న
ప్రజలను చూసి జాలేస్తుంది.
భారతీయునిగా గర్వభంగంతో
తలదించుకుంటున్నా; ఈ పిచ్చోల్ని
పరోక్షంగా పార్లమెంటుకు
పంపినందుకు సిగ్గుపడుతున్నా!!

Monday, February 10, 2014

మాయా ప్రపంచం

మాయా ప్రపంచం,మాయా ప్రపంచం
మూఢంలో మునిగెను ప్రపంచం
అంధత్వంలో ఆహ్లాదతను వెతుకుతూ,
ఆపై అఙ్ఞానాన్ని విస్తరిస్తూ,
మూసిన మెదళ్ళతో మాదే నిజం అంటూ,
మిగిలిందంతా కల్ల అనే భ్రాంతి మాయలో
మైమరపించి, సంగీతంలో లీనపరచి ,
ఆహ్వానించి ఎదుటవారిని
ఇంతా బతికిన బ్రతుకు తప్పనీ,
మేమే సత్యం మేమే నిత్యం ,
మీరు మమ్మనుసరించమనీ,
వ్యాకోచించాల్సిన వయస్సు వారిలో,
సంకుచిత అనర్ధభావాల-
విత్తులను నాటుతూ,
విస్మరిస్తూ విశ్వరూపాన్ని,
విశ్వాసాలతో బతుకీడిస్తూ,
మంచి చెడులు, నడవడికలతో
నిమిత్తం లేక కరుణ ఉండునని-
వాగ్దానం ఇస్తూ,ప్రేమ పేరున-
ప్రార్ధనతో సమస్తం సమసిపోవునని,
కరుణతో కల్మషం కుళ్ళు కడుగబడునని,
తప్పుల చేసే అవకాశం ఉంది,
పాపం మాత్రాం సాతాను సొంతం-
కాదు కర్తదని ,నమ్మబలుకుతూ
ఉచ్చులోకి దింపుతున్నది ,
డబ్బులు వెదజల్లుతూ,
మనసులను  మనుషులను మార్చమని,
మాయ చెప్పగా,
చేతన చుపిస్తుంది వెర్రి ప్రపంచం!!!