Friday, July 30, 2010

ఎందుకు?:::::::

ప్రజ్వలిల్లే కాంతులీనే సూర్యరశ్మి తాకగా..
పుడమి పైన జననమెత్తె జీవరాశి మెల్లగా..

నిరుడు చూస్తే నరుడు లేడు.. నేడు చూస్తే అంతయు...
కరుణ లేదు.. కలుగ లేదు.. ఱేడులే జగమంతయు...

తఱువు చెరువుల ధరిత్రిని....తరిగించు "వాడ" లెందుకు?
మనువు మనసుల మనిషిని...కఠినయించు కాంక్షలెందుకు?

ఇంటి కూడు చేదు చప్పన. . .సంత రుచికై నెపములెందుకు?
సొంత దుద్దు చెమట కంపురా...పరుగు పొరుగు  దేశమునకెందుకు?

జట్టులోన ఉండికూడా ..జత కట్టవెందుకు?
జగములోన ఉండెవాడా.. జగడమాడెవెందుకు?   

మట్టిలోన పుట్టినోడా..మత్తు నీకు  ఎందుకు?
కట్టె లోన కాలెవాడా ..చిత్తు బతుకెందుకు?