అపరంజి చూపు చిగురించిన సౌమ్యం..
అమృత సలిలంబు సేవించిన సౌమ్యం..
అచ్చెరువొందు అందము సౌమ్యం..
అక్కరకొచ్చు బంధము సౌమ్యం...
లేలేత మనసున కోరిక సౌమ్యం..
తేనెల మాటల మురిపం సౌమ్యం...
తేటగీటిన తెనుగు పద్యం సౌమ్యం.
స్నేహగీతమునకు సాక్షం నీవు సౌమ్యం....
Friday, September 17, 2010
సౌమ్య కు జన్మదిన శుభాకాంక్షలు..
ఇరుపది వయస్సున అడుగిడినా...
బుడిబుడి నడకల పసిపాపాయివే...
చిరు మందహాసం ముఖమున విరియగా..
అలజడి వరుసలు సమసిపోవునే...
అల్లరి చేష్టల పిల్లనగ్రోవి లా..
ఆనందం పంచి ఇచ్చేటి స్నేహమా..
ఆయువు నిండుగా వెలుగగా..
హాయిగ వికసించు పారిజాతమా..
బుడిబుడి నడకల పసిపాపాయివే...
చిరు మందహాసం ముఖమున విరియగా..
అలజడి వరుసలు సమసిపోవునే...
అల్లరి చేష్టల పిల్లనగ్రోవి లా..
ఆనందం పంచి ఇచ్చేటి స్నేహమా..
ఆయువు నిండుగా వెలుగగా..
హాయిగ వికసించు పారిజాతమా..
Thursday, September 16, 2010
నేడు
నేడు కనుమూస్తున్నాను..
రేపు తెరుస్తాను అన్న నమ్మకంతో...
నేడు ముగిస్తున్నాను..
రేపు పూర్తిచేయగలను అన్న విశ్వాసంతో...
నేటికీ రేపుకీ...గంటల వ్యవధి..
అయినా రేపు ఏమిటో నిక్కచ్చిగా తెలియనిది...
అందుకే చేతిలోని నేడు ఎంతో విలువైనది...
రేపు తెరుస్తాను అన్న నమ్మకంతో...
నేడు ముగిస్తున్నాను..
రేపు పూర్తిచేయగలను అన్న విశ్వాసంతో...
నేటికీ రేపుకీ...గంటల వ్యవధి..
అయినా రేపు ఏమిటో నిక్కచ్చిగా తెలియనిది...
అందుకే చేతిలోని నేడు ఎంతో విలువైనది...
Saturday, September 11, 2010
చినుకు
ఆకాశం భూమి నడుమ దూరాలు ఎన్ని?
ఏనాడో వీడిన స్నేహాలు అన్ని...
తొలకరి చినుకు చిగురించును మైత్రిని...
ఇరువురను కలపగ తంటాలు ఎన్ని!
మధ్యవర్తికి బహుకష్టం సుమీ!
పైనుండి పలకరింపు తేవంగ ..
.......నేల పులకరించును!
కిందటి కవ్వింపులను చేర్చగా....
....... మేఘమై మైమరపించును!
ఇరువురను కలపగ తంటాలు ఎన్ని!
ఋతువులు మారంగ రుపం మారును....
మైత్రికి నాంది చినుకే పలుకును....
ఏనాడో వీడిన స్నేహాలు అన్ని...
తొలకరి చినుకు చిగురించును మైత్రిని...
ఇరువురను కలపగ తంటాలు ఎన్ని!
మధ్యవర్తికి బహుకష్టం సుమీ!
పైనుండి పలకరింపు తేవంగ ..
.......నేల పులకరించును!
కిందటి కవ్వింపులను చేర్చగా....
....... మేఘమై మైమరపించును!
ఇరువురను కలపగ తంటాలు ఎన్ని!
ఋతువులు మారంగ రుపం మారును....
మైత్రికి నాంది చినుకే పలుకును....
Monday, August 9, 2010
Friday, July 30, 2010
ఎందుకు?:::::::
ప్రజ్వలిల్లే కాంతులీనే సూర్యరశ్మి తాకగా..
పుడమి పైన జననమెత్తె జీవరాశి మెల్లగా..
నిరుడు చూస్తే నరుడు లేడు.. నేడు చూస్తే అంతయు...
కరుణ లేదు.. కలుగ లేదు.. ఱేడులే జగమంతయు...
తఱువు చెరువుల ధరిత్రిని....తరిగించు "వాడ" లెందుకు?
మనువు మనసుల మనిషిని...కఠినయించు కాంక్షలెందుకు?
ఇంటి కూడు చేదు చప్పన. . .సంత రుచికై నెపములెందుకు?
సొంత దుద్దు చెమట కంపురా...పరుగు పొరుగు దేశమునకెందుకు?
జట్టులోన ఉండికూడా ..జత కట్టవెందుకు?
జగములోన ఉండెవాడా.. జగడమాడెవెందుకు?
మట్టిలోన పుట్టినోడా..మత్తు నీకు ఎందుకు?
కట్టె లోన కాలెవాడా ..చిత్తు బతుకెందుకు?
పుడమి పైన జననమెత్తె జీవరాశి మెల్లగా..
నిరుడు చూస్తే నరుడు లేడు.. నేడు చూస్తే అంతయు...
కరుణ లేదు.. కలుగ లేదు.. ఱేడులే జగమంతయు...
తఱువు చెరువుల ధరిత్రిని....తరిగించు "వాడ" లెందుకు?
మనువు మనసుల మనిషిని...కఠినయించు కాంక్షలెందుకు?
ఇంటి కూడు చేదు చప్పన. . .సంత రుచికై నెపములెందుకు?
సొంత దుద్దు చెమట కంపురా...పరుగు పొరుగు దేశమునకెందుకు?
జట్టులోన ఉండికూడా ..జత కట్టవెందుకు?
జగములోన ఉండెవాడా.. జగడమాడెవెందుకు?
మట్టిలోన పుట్టినోడా..మత్తు నీకు ఎందుకు?
కట్టె లోన కాలెవాడా ..చిత్తు బతుకెందుకు?
Tuesday, July 13, 2010
Subscribe to:
Posts (Atom)