Friday, July 29, 2011

తీరం-తర్కము

కదలే లేని కడలి లోతులో...
ముత్యం ఉందో మృత్యువు ముందో...
తీరం దాటక తీరుతెన్నులు...
తడిమి చూడటం తర్కము కాదే..!!

Friday, March 11, 2011

ఆకు...


పచ్చని ఆకు పొడిబారే
యవ్వన సోయగానికి ఎండ తాకే'...
శిశిరం ఇది సారం విడి పోమాకే'..
నేలను రాలినా ఎరువుగా తరువును వదులకే'..

పోయిన ప్రాణమా పునర్చిగురించుమా..
ఆమని ఋతువు ఆహ్వానం నీకురా ఓ ఆకు..
బోసి చెట్టుకు పాలపంటి పాపాయి చిగురుటాకు..
నెమ్మది వదులు  వదిగాలి వీచె సాకు తో..

పచ్చని మేని నిగలు హాయిలే మా కంటి పాపకు..
జవ్వన  గొంగళిని కోక ఆరేసిన చిలుకను చేసినావె ఓ ఆకు..
ముచ్చట గొలుపు మామిడి పిండెకు పూవుకు మొదలు నీవని తెలుసు మాకు..
మాపువేళ కట్టిన గువ్వల గూడుకు ఆధారం నీవని మరువకు..


పగిలెను రాళ్ళు చాలా ఎండకు...
నీడను ఇవ్వరా ఒంటరి బాటకు..
పందిరికి పూరిగుడిసెకు తాటాకు...
నీవేలేనిదే చిధ్రం నిరుపేద బ్రతుకు...

బువ్వను వద్దించిన విస్తరాకు...
పెళ్ళి ఇంటికి  ప్రతీక అరిటాకు..
నాళిక రంగు నాభికి ఊరట తమలపాకు..
పేరులు వేరైన మాపై అదే ప్రేమ కురిపించినావె ఓ ఆకు..

Monday, February 7, 2011

ఈ స్నేహం

కదిలిన గురుతుల సమాహారం ఈ స్నేహం
మెదిలిన మనసుల మణిహారం ఈ స్నేహం
గడిపిన క్షణములే... గుండెల్లో దాగెలే
విరిసిన నవ్వులే.... మదిలో మారుమ్రోగెలే     ||2||


బాల్యపు బలపమే తెలిపెను ఈ స్నేహం
బుడిబుడి నడకలో బడిలో కలిసెను ఈ స్నేహం
వడివడి చదువులో చనువు పెంచెను ఈ స్నేహం
గడబిడ గంతులో గొంతు కలిపెను ఈ స్నేహం

||కదిలిన||

ఎదిగిన వయస్సులో  వినోదం ఈ స్నేహం
వదిలిన కన్నీటిని  తుడిచిన హస్తం ఈ స్నేహం
సడలని పట్టులో వికాసం ఈ స్నేహం
చెదరని నీతికి చేరువ చిహ్నం ఈ స్నేహం

||కదిలిన||

Sunday, February 6, 2011

రాజకీయం..

రాజకీయం.. రంగులమయం...
వేషాల జగన్నాటకం..
చక్కిలి చిరు బూటకం..
కాసుల వేట లో
గడిపె పూటలు..
దాచిన సొత్తుకు..
బినామీ హామి గుట్టులు...
మింగేవాడికి తప్ప పెట్టేవాడికి కలిసిరాని జూదం...
రండి రండి ఇది ప్రజల పక్షాన చూద్దాం...

Wednesday, December 22, 2010

సమయం

సమయం విలువైనది...
అరచేతిలో కరిగే నిధి..
మనకోసం ఆగక ప్రవహించు-నది.
లిఖించని స్వీయచరిత్రలకు సారాంశం...
జారవిడిచిన అవకాశాల వెల్లువకు నిలువెత్తు సాక్ష్యం...
అనంతకు నీ కొలమానం కేవలం నీ జీవిత పరిమాణం..

Sunday, November 21, 2010

ఐతే.....అసంపూర్ణం

పదనిసలే పలుకులైతే...
జిగిబిగి వెలుతురులే చూపులైతే..
ఉల్లాసమే ఊపిరైతే ....
వికాసమే బాటైతే...
అనందమే బ్రతుకు ఐతే..
జీవితం అసంపూర్ణం...
మనుగడ నడిదూరమే...