ప్రజ్వలిల్లే కాంతులీనే సూర్యరశ్మి తాకగా..
పుడమి పైన జననమెత్తె జీవరాశి మెల్లగా..
నిరుడు చూస్తే నరుడు లేడు.. నేడు చూస్తే అంతయు...
కరుణ లేదు.. కలుగ లేదు.. ఱేడులే జగమంతయు...
తఱువు చెరువుల ధరిత్రిని....తరిగించు "వాడ" లెందుకు?
మనువు మనసుల మనిషిని...కఠినయించు కాంక్షలెందుకు?
ఇంటి కూడు చేదు చప్పన. . .సంత రుచికై నెపములెందుకు?
సొంత దుద్దు చెమట కంపురా...పరుగు పొరుగు దేశమునకెందుకు?
జట్టులోన ఉండికూడా ..జత కట్టవెందుకు?
జగములోన ఉండెవాడా.. జగడమాడెవెందుకు?
మట్టిలోన పుట్టినోడా..మత్తు నీకు ఎందుకు?
కట్టె లోన కాలెవాడా ..చిత్తు బతుకెందుకు?
Friday, July 30, 2010
Tuesday, July 13, 2010
Saturday, July 10, 2010
Saturday, June 19, 2010
గుండెకు గాయం
రోజాపూవ్ ముట్టుకుంటే చేతికి గాయం..
ప్రేమ పూవ్ పట్టుకుంటే గుండెకు గాయం...
వెంటాడె స్వప్నాలే దహించు కాయం..
వేదనలే పంచుకోగా నువ్వే మాయం.. [రోజాపూవ్2]
ఒంటరినే చేసావె...
మదినే కాజేసావె...
కుంపటినే రాజేసి..కనుమరుగయ్యావే... [రోజాపూవ్1]
ఏం పాపం చేసానె..
మనసే కోసేసావె...
బంధాన్నే తెంచేసి..బంధించేసావే... [రోజాపూవ్1]
ప్రేమ పూవ్ పట్టుకుంటే గుండెకు గాయం...
వెంటాడె స్వప్నాలే దహించు కాయం..
వేదనలే పంచుకోగా నువ్వే మాయం.. [రోజాపూవ్2]
ఒంటరినే చేసావె...
మదినే కాజేసావె...
కుంపటినే రాజేసి..కనుమరుగయ్యావే... [రోజాపూవ్1]
ఏం పాపం చేసానె..
మనసే కోసేసావె...
బంధాన్నే తెంచేసి..బంధించేసావే... [రోజాపూవ్1]
Tuesday, June 8, 2010
జీవనం.....::
జీవనం.....::
పనిలో పరుగు...
తనువే తరుగు....
మమతే కరువు.....
మనిషే బరువు....
పైసలే పరువు....
జీవనం ఓ జీవం లేని తరువు.....
పనిలో పరుగు...
తనువే తరుగు....
మమతే కరువు.....
మనిషే బరువు....
పైసలే పరువు....
జీవనం ఓ జీవం లేని తరువు.....
Monday, June 7, 2010
చెలియ పరిణయం
మౌనమే గొంతులో..భారమే గుండెలో...
ప్రేమిక పెళ్ళిలో....మనసులే ముక్కలౌ!!.
"మంట"పాన ఉన్న ఈ అగ్ని ఱేడు..
సాక్షమౌతున్నాడె..చితికి నేడు..
పెద్దల దీవెనలె...ఇద్దరి వేదనలౌ.
ప్రేమకే ఉరితాళ్ళే.. తాళి ముడులౌ..
కళ్ళతో చూడగలనా...ఈ దారుణం??..
కళ్ళముందే జరుగుతుంటే చెలియ పరిణయం..
ఆపలేకున్నానే కంట నీరు..
ఏరులయ్ పారంగా ఇది ఆపేదెవరు??..
ప్రేమిక పెళ్ళిలో....మనసులే ముక్కలౌ!!.
"మంట"పాన ఉన్న ఈ అగ్ని ఱేడు..
సాక్షమౌతున్నాడె..చితికి నేడు..
పెద్దల దీవెనలె...ఇద్దరి వేదనలౌ.
ప్రేమకే ఉరితాళ్ళే.. తాళి ముడులౌ..
కళ్ళతో చూడగలనా...ఈ దారుణం??..
కళ్ళముందే జరుగుతుంటే చెలియ పరిణయం..
ఆపలేకున్నానే కంట నీరు..
ఏరులయ్ పారంగా ఇది ఆపేదెవరు??..
Tuesday, June 1, 2010
ప్రాణం:::
ప్రాణం:::
ప్రాణం అన్నది... ఇక్కడ లేదుగా...
ప్రాయం ఒడిలో.... మరుగైపోయెనే....
మదిలో స్మృతులే....నీవైనాయిగా....
మంచు బిందువై.... కరిగి పోయెనే...
నా చెలి చెలిమే....నన్నే చేరగా..
యెదలో భారమే....తేలిక అయ్యెనే...
కంటికి రెప్పలా.... నీ తోడు నేనుగా..
కలిసి బ్రతికే......కాలం వెల్లువా...
చనువుకు ముద్దులా....చంద్రుని సాక్షిగా...
నీ చితిలో కలవగా..నేస్తం నేనుగా....
ప్రాణం అన్నది... ఇక్కడ లేదుగా...
ప్రాయం ఒడిలో.... మరుగైపోయెనే....
మదిలో స్మృతులే....నీవైనాయిగా....
మంచు బిందువై.... కరిగి పోయెనే...
నా చెలి చెలిమే....నన్నే చేరగా..
యెదలో భారమే....తేలిక అయ్యెనే...
కంటికి రెప్పలా.... నీ తోడు నేనుగా..
కలిసి బ్రతికే......కాలం వెల్లువా...
చనువుకు ముద్దులా....చంద్రుని సాక్షిగా...
నీ చితిలో కలవగా..నేస్తం నేనుగా....
Subscribe to:
Posts (Atom)